రేపు ఆర్‌ఈసీలో వాటాల విక్రయం

7 Apr, 2015 00:59 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ)లో 5 శాతం వాటాల విక్రయాన్ని కేంద్రం ఏప్రిల్ 8న  చేపట్టనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో 4.93 కోట్ల షేర్ల విక్రయం ద్వారా రూ. 1,600 కోట్లు సమీకరించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి డిజిన్వెస్ట్‌మెంట్ కానుంది. సోమవారం బీఎస్‌ఈలో ఆర్‌ఈసీ షేర్లు 0.52 శాతం క్షీణించి రూ. 335.60 వద్ద ముగిశాయి. ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే ఓఎఫ్‌ఎస్ షేరు రేటును ప్రభుత్వం మరింత తక్కువగా నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. ఆఫర్‌లో 20 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు. ఇష్యూ ధరతో పోలిస్తే వారికి 5 శాతం డిస్కౌంటు లభిస్తుంది.
 

>
మరిన్ని వార్తలు