వ్యాయామంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది

4 Aug, 2016 17:46 IST|Sakshi

రోజూ వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుందని మనకు తెలుసు. అయితే దీనివల్ల మన జ్ఞాపకశక్తి కూడా పదికాలాల పాటు పదిలంగా ఉంటుందంటున్నారు టెక్సస్ ఎ అండ్ ఎం కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు. వ్యాయామంతో మెదడులోని కీలకమైన ప్రాంతంలో ఎప్పటికప్పుడు కొత్తకొత్త న్యూరాన్లు పుట్టుకొస్తాయని, ఫలితంగా పాత జ్ఞాపకాలను మరచిపోకుండా ఉంటామని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న భారతీయ సంతతి శాస్త్రవేత్త అశోక్ శెట్టి అంటున్నారు.

 

రెండేళ్ల క్రితం తాము ఒకరకమైన ఎలుకలపై ప్రయోగాలు జరిపినప్పుడు మెదడులోని హిప్పోకాంపస్ ప్రాంతంలో ఎక్కువ స్థాయిలో కొత్త న్యూరాన్లు ఏర్పడ్డాయని, అయితే ఆ తరువాత ఆ ఎలుకలు అప్పటివరకూ నేర్చుకున్న అంశాలను మరచిపోయాయని ఆయన తెలిపారు. దీంతో తాము మరోరకమైన ఎలుకలపై ప్రయోగాలు చేపట్టామని, దీంట్లో ఎలాంటి ప్రతికూల ఫలితాలూ రాలేదని తెలిపారు. గత పరిశోధనలను చూసి వ్యాయామం వల్ల జ్ఞాపకశక్తి నశిస్తుందనుకునే వారికి తాజా అంచనాలు సాంత్వన చేకూరుస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు