దూసుకుపోతున్న జియో

15 Feb, 2017 17:30 IST|Sakshi
దూసుకుపోతున్న జియో

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో  దేశీయ టెలికాం రంగంలో  సునామీలా దూసుకుపోతోంది.  ఇప్పటికే   ఉచిత ఆఫర్లతో  మేజర్‌ టెలికం కంపెనీల గుండెల్లో  గుబులు పుట్టిస్తున్న జియో టెలికాం మార్కెట్‌ లో  వినియోగదారుల పరంగా 23శాతం మార్కెట్‌ షేర్‌ ను సొంతం చేసుకుంది.  మొబైల్ కమ్యూనికేషన్ యాప్‌ ట్రూ కాలర్‌ కు చెందిన   ట్రూ ఇన్‌సైట్‌ క్యూ 4 నివేదికలో ఈ వివరాలను బుధవారం వెల్లడించింది.
 
గత ఆరునెలల గణాంకాలను పరిశీలించిన మీదట ఈ వివరాలను ప్రకటించినట్ టుతెలిపింది.  2016 వేసవి  తరువాత బాగా పెరిగిన  జియో  వినియోగదారుల  సంఖ్య ఏడాది చివరికి మరింత దూసుకుపోయిందని రిపోర్ట్‌ చేసింది.  దీని ప్రకారం భారతీయ టెలికం మార్కెట్‌ లో రెండవ స్థానంలోకి దూసుకు వచ్చింది. ప్రధానంగా ఉచిత డ్యాటా, వాయిస్‌ కాలింగ్‌ సేవల లాంచింగ్‌ తో 2016  అర్థభాగంలో  బాగా విస్తరించిందని నివేదించింది.

ఉచిత సేవలు ప్రారంభించిన  మూడు నెలల్లో  నవంబర్‌ లో 16.2 మిలియన్లుగా ఉన్న ఖాతాదారుల సంఖ్య  తాజాగా 51.87 మిలియన్లకు చేరింది. 2016 నవంబర్‌ చివరినాటికి  ట్రాయ్‌ అంచనాల ప్రకారం  టెలికాం చందాదారుల సంఖ్య 1.2 బిలియన్లను తాకింది  30 సెకన్లలోపు జియో యూజర్స్‌ కాల్స్‌, వోడాఫోన్‌ 41  సెంకండ్లలో  కాల్‌ చేస్తున్నట్టు  గుర్తించింది.

జియో ద్వారా పెరిగిన సబ్‌ స్క్రైబర్ల తో కలిపి మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో 2017 చివరి నాటికి 500 మిలియన్లకు పైగా వినియోగదారులు పెరగనున్నారని  ట్రాయ్‌ భావిస్తోంది.  ముఖ్యంగా ఈ పెరుగుదలలో ప్రధాన వాటా రిలయన్స్‌ జియో ఇన్పోకాం దే కానుందట. అలాగే  ట్రాయ్  నవంబర్‌ గణాంకాల ప్రకారం  మొబైల్ బ్రాడ్బ్యాండ్ విభాగంలో కూడా ముందంజలో ఉందని తెలిపింది.   ఆతరువాత ఐడియా 2.52 మిలియన్ల కొత్తగా వినియోగదారులు,  భారతి ఎయిర్‌ టెల్‌ 1.08, వోడాఫోన్‌​  890.794 కొత్త చందాదారులు జోడించుకుందట.

 కాగా జియో ఉచిత సేవలు తాజా  న్యూ ఇయర్‌ ఆఫర్‌ మార్చి 31 వరకు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.   

 

మరిన్ని వార్తలు