జియో ఉచిత ఆఫర్లు కొనసాగుతాయ్!

16 Mar, 2017 14:10 IST|Sakshi
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో అందించే ఉచిత ఆఫర్లపై స్టే విధించడానికి టెలికాం ట్రిబ్యునల్ నిరాకరించింది. జియో ఉచిత సేవల నిలిపివేతకు నిరాకరించిన టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పీలెట్ ట్రిబ్యునల్(టీడీశాట్), అయితే ఆ ఆఫర్లను కొనసాగించుకునేలా ఆపరేటర్ కు ఇచ్చిన జనవరి 31 నాటి అనుమతిని పునఃపరిశీలించాలని ట్రాయ్ ను ఆదేశించింది. రెండు వారాల్లో దీనిపై ఓ నివేదికను తమకు అందించాలని ట్రాయ్ కి టీడీశాట్ ఆదేశాలు జారీచేసింది. రిలయన్స్ జియో అందిస్తున్న ఉచిత ఆఫర్లపై స్టే విధించాలని కోరుతూ టెలికాం కంపెనీలు వేసిన మధ్యంతర అప్పీల్ పై ఆదేశాలను టీడీశాట్ రిజర్వులో పెట్టిన సంగతి తెలిసిందే.
 
అయితే ప్రస్తుతం జియో అందిస్తున్న ఉచిత ఆఫర్లు కొనసాగేలా, ఆఫర్లపై స్టే విధించడానికి టీడీశాట్ నిరాకరించింది. గతేడాది సెప్టెంబర్ నుంచి జియో ఉచిత వాయిస్, డేటా ప్లాన్ ను కస్టమర్లకు అందిస్తోంది. డిసెంబర్ లో మళ్లీ తమ ఉచిత సర్వీసులను 2017 మార్చి 31 వరకు పొడిగించింది. దీనిపై ఆగ్రహించిన టెలికాం కంపెనీలు ట్రాయ్ కు వ్యతిరేకంగా టీడీశాట్ ను ఆశ్రయించాయి. జియో ఉచిత కాలింగ్, డేటా ప్లాన్ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని, ఎలాంటి ఉల్లంఘన కంపెనీ చేయడం లేదని రెగ్యులేటరీ ట్రాయ్ క్లీన్ చీట్ ఇచ్చింది. జియో వెల్ కమ్ ఆఫర్ కు, హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కు తేడా ఉందని ట్రాయ్ పేర్కొంది. 
 
మరిన్ని వార్తలు