సింగరేణిలో ఘనంగా ‘గణతంత్రం’

27 Jan, 2016 02:44 IST|Sakshi

* హాజరైన చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీధర్
* తొలిసారిగా ఖనిలో జరిపిన సెంట్రల్ ఫంక్షన్ సక్సెస్

గోదావరిఖని : సింగరేణి సంస్థ ఆవిర్భవించిన 127 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా గోదావరిఖనిలో గణతంత్ర వేడుకల సెంట్రల్  ఫంక్షన్‌ను మంగళవారం నిర్వహించారు. ఈ వేడుకలను సంస్థ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ నడిమెట్ల శ్రీధర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. సాధారణంగా సింగరేణి కార్పొరేట్ కార్యాలయం  ఉన్న కొత్తగూడెంలోనే గణతంత్ర వేడుకలను ఇన్నేళ్లుగా నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఇటీవల హైదరాబాద్, కొత్తగూడెంలో జరిగిన సమావేశాలలో కార్మిక సంఘాల విన్నపం మేరకు తొలిసారిగా ఈ వేడుకలను గోదావరిఖనిలో నిర్వహించాలని నిర్ణయిం చారు.

దీంతో మంగళవారం వేడుకలు ఆడంబరంగా జరగగా.. కార్మిక, అధికారుల కుటుంబాలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ ముందుగా ఎల్లందు క్లబ్ నుంచి ఎస్‌అండ్‌పీసీ గార్డులు బుల్లెట్ వాహనాలతో ఎస్కార్ట్‌గా.. పోలీస్ వాహనం ముందు నిలవగా.. ఆయన సింగరేణి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంకు చేరుకున్నారు. స్కౌట్ పార్టీ నుంచి ఆయన గౌరవవందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సమయంలో ప్రత్యేక వాహనంపై నిలబడి రామగుండం రీజియన్‌కు చెందిన ఎస్‌అండ్‌పీసీ గార్డులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, పాఠశాల విద్యార్థుల నుంచి గౌరవవందనం స్వీకరించారు.

సింగరేణి విస్తరించిన నాలుగు జిల్లాలకు చెందిన ఉత్తమ కార్మికులు, అధికారులను సీఎండీ, డెరైక్టర్లు ఎ.మనోహర్‌రావు, జె.పవిత్రన్‌కుమార్, రమేష్‌బాబు, వెల్ఫేర్ జీఎం ఆనందరావు, గుర్తింపు, ప్రాతి నిధ్య కార్మిక సంఘాల ప్రతినిధులు మిర్యాల రాజిరెడ్డి, బి.వె ంకట్రావు, వై.గట్టయ్య, ఏరియాల జీఎంలు కెవి రమణమూర్తి, విజయపాల్‌రెడ్డి, ఎంఎస్ వెంకట్రామయ్య, చంద్రశేఖర్ శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించి బహుమతులు అందజేశారు.

మరిన్ని వార్తలు