కేసీఆర్ బృందం పాస్ పోర్ట్లు బయటపెట్టాలి

6 Oct, 2015 17:10 IST|Sakshi
కేసీఆర్ బృందం పాస్ పోర్ట్లు బయటపెట్టాలి

హైదరాబాద్ : ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం తమ పాస్ పోర్ట్లను బయటపెట్టాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. చైనాలోని మకావులో సీఎం కేసీఆర్ బృందం జల్సా చేసిందని ఆరోపించారు. మంగళవారం మెదక్ జిల్లా గజ్వేల్లో నిర్వహించిన 'రైతు కోసం దీక్ష' కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

ఓ వైపు రాష్ట్రంలో రైతులు చనిపోతుంటే... మరో వైపు సచివాలయంలో ప్రభుత్వం బర్త్డే పార్టీలు జరుపుకుంటుందని విమర్శించారు. రైతులు చనిపోతుంటే ఒక్క మంత్రి కూడా వారి కుటుంబాలను పరామర్శించడం లేదని రేవంత్రెడ్డి అన్నారు. శాసనసభలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ ప్రభుత్వం చూస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు