సహకారమే సరైన, ఏకైక అవకాశం: చైనా

20 Mar, 2017 03:45 IST|Sakshi

బీజింగ్‌: అమెరికాతో ఆరోగ్యకర, సుస్థిర ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తెలిపారు. పరస్పర సహకారంతో ముందుకెళ్లటమే ఇరు దేశాలకున్న ఏకైక అవకాశమన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌తో భేటీ అయిన జిన్‌పింగ్‌.. ‘మనం జాగ్రత్తగా చర్చించుకోవాలి.

ఆరోగ్యకర, సుస్థిర చైనా–అమెరికా సంబంధాల అభివృద్ధిలో కొత్త శకం ప్రారంభం కావాలి’ అని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. చైనాపై చేస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. పరస్పర సహకారంతో ముందుకెళ్లటమే ఇరుదేశాల ముందున్న ఏకైక అవకాశమన్నారు.

>
మరిన్ని వార్తలు