ప్రయాణికులపై కాల్పులు.. రైలు దోపిడీ

1 Apr, 2014 12:49 IST|Sakshi

చెన్నై ఎక్స్ప్రెస్ దోపిడీ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియకముందే మరో రైలు దోపిడీ జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని ఇటావా సమీపంలో సంగమ్ ఎక్స్ప్రెస్లో సోమవారం రాత్రి ఈ దోపిడీ జరిగింది. దాదాపు డజను మంది సాయుధులు ప్రయాణికులపై కాల్పులు జరిపి, ముగ్గురిని తీవ్రంగా గాయపరిచారు. మొత్తం అందరివద్ద ఉన్న నగలు, నగదు, ఇతర విలువైన వస్తువులు తీసుకుని అక్కడినుంచి పరారయ్యారు. (చెన్నై ఎక్స్ప్రెస్లో దొంగల బీభత్సం)

అలహాబాద్ నుంచి మీరట్ వెళ్తున్న ఈ రైలు భర్తానా, ఎక్డిల్ రైల్వే స్టేషన్ల మధ్య ఆగినప్పుడు దుండగులు స్లీపర్ బోగీలోకి ప్రవేశించారు. వారిని ఆపేందుకు ఆ బోగీలో ప్రయాణిస్తున్న ముగ్గురు వైద్య విద్యార్థులు ప్రయత్నించగా, వాళ్లపై కాల్పులు జరిపి గాయపరిచారు. ప్రయాణికుల వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్లు, వాచీలు, నగలు.. అన్నింటినీ దోచుకుని, చైను లాగి పారిపోయారు. దొంగలను ఆపేందుకు రైల్లో ఉన్న పోలీసులు ప్రయత్నించగా, వాళ్లమీద కూడా కాల్పులు జరిపారు. క్షతగాత్రులందరినీ సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. (పక్కా ప్లాన్తోనే రైలు దోపిడీ)

మరిన్ని వార్తలు