రాకెట్ దాడిలో బాలిక మృతి

29 Jul, 2014 16:22 IST|Sakshi

ఈజిప్టులోని సినాయ్ ప్రాంతంలో ఓ ఇంటిపై రాకెట్ దాడి జరగడంతో తొమ్మిదేళ్ల బాలిక మరణించింది. వాస్తవానికి ఆ ఇంటికి సమీపం నుంచి వెళ్తున్న భద్రతా దళాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు రాకెట్ ప్రయోగించగా, అది కాస్తా ఆ ఇంటిమీద పడటంతో బాలిక మరణించింది, మరో బాలిక తీవ్రంగా గాపడింది. ఇజ్రాయెల్ సరిహద్దులోని ఉత్తర సినాయ్ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది.

గత వారం రోజుల్లో భద్రతాదళాల చేతుల్లో దాదాపు 40 మంది ఉగ్రవాదులు మరణించారు. దానికి ప్రతీకారంగా భద్రతాదళాలను హతమార్చాలని ఈ రాకెట్ దాడి చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఉగ్రవాదులను హతమార్చేందుకు సైన్యం భారీస్థాయిలో దాడులు చేసింది. అంతకుముందు ఇద్దరు పోలీసులను, సైనికాధికారులను ఉగ్రవాదులు హతమార్చారు. ఇలా ప్రతీకార దాడులు అక్కడ నిరంతరం కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు