12 దేశాల్లో రోల్స్ రాయిస్ భారీ అక్రమాలు

1 Nov, 2016 11:47 IST|Sakshi
12 దేశాల్లో రోల్స్ రాయిస్ భారీ అక్రమాలు
లండన్ : బ్రిటన్ ప్రముఖ తయారీ సంస్థ రోల్స్ రాయిస్, ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో భారీ అక్రమాలకు పాల్పడినట్టు వెల్లడవుతోంది. సీక్రెట్గా ఏజెంట్స్ను నియమించుకుని లాభాదాయకమైన భూ ఒప్పందాల్లో అక్రమాలకు పాల్పడినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. వారికి లంచాలు కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. గార్డియన్, బీబీసీ విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం బ్రాడ్ కాస్ట్ అయిన పనోరమ ప్రొగ్రామ్లో ఈ విషయాలు బీబీసీ పేర్కొంది.  లాభాలు పెంచుకోవడానికి అక్రమ చెల్లింపుల పద్ధతిని అనుసరించి రోల్స్ రాయిస్ ప్రయోజనాలు పొందిందని బీబీసీ, గార్డియన్లు తెలిపాయి. ల్యాండ్ కాంట్రాక్టులు పొందడానికి కూడా ఏజెంట్లు అక్రమ చెల్లింపులకు తెరతీశారని సంస్థ అంతర్గత వ్యక్తులు చెబుతున్నారు.  ఈ విషయంపై అమెరికా, బ్రిటన్ అవినీతి నిరోధక ఏజెన్సీలు నెట్వర్క్ ఏజెంట్లను విచారించడం ప్రారంభించాయి.  
 
13 బిలియన్ పౌండ్ల(రూ.1,06,125కోట్లకు పైగా) విలువ కలిగిన టర్బైన్లను, ఇంజన్లను ప్యాసెంజర్, మిలటరీ ఎయిర్క్రాప్ట్లకు విక్రయించిన రోల్స్ రాయిస్ వాటిపై మాత్రం పూర్తి వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తోంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న విచారణకు తాము సహకరిస్తామని, కానీ మధ్యవర్తిత్వలు పాల్పడిన అవినీతి, లంచాలకు సంబంధించిన విషయాలు మాత్రం సీరియస్ ఫ్రాడ్ ఆఫీసు, ఇతర అథారిటీలు విచారిస్తాయని దాటవేస్తోంది.
 
బ్రెజిల్, భారత్, చైనా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, అంగోలా, ఇరాక్, ఇరాన్, కజాఖ్స్తాన్, అజర్బైజాన్, నైజీరియా, సౌదీ అరేబియాలలో రోల్స్ రాయిస్ ఏజెంట్లను నియమించుకుని ఈ అక్రమాలకు పాల్పడిందని బీబీసీ రిపోర్టు చేసింది. బీబీసీ రిపోర్టులో భారత్కు చెందిన తన డిపెన్స్ ఏజెంట్ సుధీర్ చౌదరికి అక్రమంగా 10 మిలియన్ పౌండ్ల(రూ.81కోట్లకు పైగా) ను రోల్స్ రాయిస్ చెల్లించిందని వెల్లడైంది. భారత వైమానిక దళం వాడే  హాక్ ఎయిర్క్రాప్ట్ల అతిపెద్ద కాంట్రాక్ట్ రోల్స్ రాయిస్ చేతికి వెళ్లడానికి ఆయన సహకారం అందించినట్టు బీబీసీ తెలిపింది.
మరిన్ని వార్తలు