బెంగళూరులో 1.14 కోట్ల ఉగ్రవాద సొమ్ము స్వాధీనం

4 Nov, 2013 20:39 IST|Sakshi

బెంగళూరులో ఓ వ్యాపారవేత్త నుంచి రూ. 1.14 కోట్ల నగదును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వాధీనం చేసుకుంది. మణిపూర్లోని రెండు నిషేధిత ఉగ్రవాద సంస్థలకు ఈ సొమ్ము చెందినదని భావిస్తున్నారు. పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లైపాక్ (ప్రీపాక్), యునైటెడ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ కాంగ్లైపాక్ (యూపీపీకే) అనే రెండు ఉగ్రవాద సంస్థలకు ఎన్.శాంతి మైతి అనే వ్యక్తి ప్రధాన కార్యదర్శినని చెప్పుకొంటాడని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. గతంలో ఇతడిని ఉగ్రవాద సంబంధిత కేసులో ఎన్ఐఏ ఓసారి అరెస్టు చేసింది.

తాజాగా స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని ఓ వ్యాపారవేత్త అతడి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో డిపాజిట్ చేసి ఇక్కడి నుంచి నడిపిస్తున్నాడని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. అయితే అతడి పేరు మాత్రం వెల్లడించడానికి అంగీకరించలేదు. ఉగ్రవాదులు చాలావరకు తమ సొమ్మును బెంగళూరులో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతున్నారని దర్యాప్తులో తేలింది. ఇప్పటివరకు ఇలా ఉగ్రవాద కేసుల్లో పట్టుకున్న మొత్తంలో ఇదే అత్యధికం.

మరిన్ని వార్తలు