రూ.1.50 కోట్లు కర్ణాటక పోలీసులకు అప్పగింత

12 Aug, 2015 18:38 IST|Sakshi

సూర్యాపేట(నల్లగొండ): ఈ నెల 6వ తేదీన నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో ఉన్న ఓ కారులో స్వాధీనం చేసుకున్న రూ.1.50 కోట్ల సొమ్మును పట్టణ సీఐ మొగలయ్య కర్ణాటకలోని గోల్‌గుంబజ్ పట్టణ సీఐ సుల్ఫీకి బుధవారం అప్పగించారు. ఈ సందర్భంగా సీఐ మొగలయ్య మాట్లాడుతూ డీఎస్పీ ఎంఏ రషీద్ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్లను స్వాధీనం చేసుకోగా ఆ డబ్బును కోర్టుకు అప్పగించామని, తిరిగి కర్ణాటక పోలీసులకు అప్పగించేందుకు కోర్టు అనుమతించిందని తెలిపారు. కోర్టు అనుమతితో కర్ణాటక పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు.

అక్కడి పోలీసులు కర్ణాటక కోర్టులో అప్పగిస్తారని, పూర్తి విచారణ తర్వాత సంబంధిత బ్యాంకు అధికారులకు కోర్టు నుంచి ఆ డబ్బును అప్పగిస్తారని తెలిపారు. ఈ కేసు విషయంలో ఈ నెల 8న కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ డీఎస్పీ పాటిల్ పట్టణ పోలీసు స్టేషన్‌కు విచారణకు వ చ్చారు. ఆ డబ్బును కర్ణాటక రాష్ట్రం బిజాపూర్‌లోని ఐసీఐసీఐ శాఖ నుంచి ఆ బ్యాంకు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్‌లు కలసి దొంగతనం చేశారని తెలిపిన విషయం విదితమే.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు