మదర్సన్ సుమికి రూ. 15,400 కోట్ల ఆర్డరు

30 Apr, 2015 02:11 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ మదర్సన్ సుమి సిస్టమ్స్ (ఎంఎస్‌ఎస్‌ఎల్) తాజాగా జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం దైమ్లర్ నుంచి భారీ ఆర్డర్లు దక్కించుకుంది. వీటి విలువ రూ. 15,400 కోట్లు. కాంట్రాక్టుల కింద కొత్త తరం మెర్సిడెస్ బెంజ్ వాహనాలకు వెలుపలి, లోపలి భాగాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. అనుబంధ సంస్థ సంవర్ధన మదర్సన్ ఆటోమోటివ్ సిస్టమ్స్ ఈ ఆర్డర్లు దక్కించుకున్నట్లు ఎంఎస్‌ఎస్‌ఎల్ తెలిపింది.

2018 నుంచి మొదలయ్యే ఆర్డర్ల విలువ జీవిత కాలంలో రూ. 15,400 కోట్లు (సుమారు 2.2 బిలియన్ యూరోలు) రాగలవని పేర్కొంది. దైమ్లర్ కాంట్రాక్టులకు సరఫరా కోసం రెండు అమెరికాలో, హంగరీలో చెరొక కొత్త ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు ఎంఎస్‌ఎస్‌ఎల్ వివరించింది. అయితే, వీటిపై ఎంత ఇన్వెస్ట్ చేయనున్నది కంపెనీ వెల్లడించలేదు.
 

>
మరిన్ని వార్తలు