ముత్తూట్ ఫైనాన్స్ లో మరో భారీ చోరీ

26 Dec, 2016 15:24 IST|Sakshi

గుజరాత్: దేశంలో అతిపెద్ద గోల్డ్‌లోన్‌  సంస్థ ముత్తూట్ ఫైనాన్స్  కు ఊహించని షాక్  తగిలింది. గుజరాత్లోని ధరోజి ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయాన్ని  దొంగలు లూటీ చేశారు. సోమవారం చోటుచేసుకున్న ఈ దిగ్భ్రాంతికర  సంఘటనలో సుమారు రూ.90 లక్షల సొమ్మును   దోచుకెళ్లారు. 

తాజా నివేదికల ప్రకారం సుమారు ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు ఈ చోరీలో పొల్గొన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న  పోలీసులు విచారణ  చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే  చోరీకి గురైన సొత్తు పాత నోట్లా లేక కొత్త నోట్లా తదితర  పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.  విచారణ కొనసాగుతోంది.
  కాగా ఈ ఏడాది ఆగస్టులో  సేలం ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో ఇలాంటి భారీ చోరీ  జరిగింది.  గోడకు రంధ్రం చేసి షాప్ లోకి ప్రవేశించిన  దొంగలు రూ. 1,34,000 నగదును,  అయిదున్నర కిలోల బంగారాన్నిఎత్తుకెళ్లిన సంగతి  తెలిసిందే.