అందుకే బీజేపీకి ఓటేశారు: ఆరెస్సెస్‌

12 Mar, 2017 17:06 IST|Sakshi
అందుకే బీజేపీకి ఓటేశారు: ఆరెస్సెస్‌

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయంపై ఆ పార్టీ మాతృసంస్థ ఆరెస్సెస్‌ స్పందించింది. యూపీలో బీజేపీ భారీ విజయాన్ని అయోధ్యలో రామమందిర నిర్మాణానికి దక్కిన ప్రజామద్దతుగా భావించాలని ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్త ఎంజీ వైద్య పేర్కొన్నారు. బీజేపీ మ్యానిఫెస్టోలో సైతం అయోధ్యలో రామమందిర నిర్మాణ అంశాన్ని ప్రస్తావించారని, ఈ నేపథ్యంలో ఈ భారీ విజయాన్ని ఇందుకు ప్రజామోదంగా భావించవచ్చునని ఆయన పీటీఐతో అన్నారు.

అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో రామమందిరం ఉండేదని, ఆ ఆలయం శకలాలు తవ్వకాల్లో బయటపడ్డాయని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొన్నదని ఆయన అన్నారు. రామమందిరం అంశాన్ని పరిష్కరించడంలో సుప్రీంకోర్టు విఫలమైనపక్షంలో మందిర నిర్మాణం కోసం ఎన్డీయే ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తేవాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు