అంజలి పెళ్లి చేసుకోబోతున్నదా?

1 Jan, 2017 10:48 IST|Sakshi
అంజలి పెళ్లి చేసుకోబోతున్నదా?

టాలీవుడ్‌ కథానాయిక అంజలి పెళ్లి గురించి మరోసారి రూమర్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న అంజలి ప్రస్తుతం కోలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టినట్టు కనిపిస్తోంది. 2016లో బాలకృష్ణ సరసన డిక్టేటర్‌ సినిమాలో కథానాయికగా నటించింది. స్టైలిష్‌ స్టార్‌ బన్నీతో 'సరైనోడు'లో స్పెషల్‌ సాంగ్‌ చేసింది.

ఎక్కువ తమిళ సినిమాలు చేస్తున్న అంజలి మీద కోలీవుడ్‌లో గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. ఒక సహ నటుడితో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉన్నారని వదంతులు వినిపిస్తున్నాయి. గతంలో అంజలి పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందంటూ కథనాలు కూడా వచ్చాయి. 'జర్నీ' సినిమాలో తనతో కలిసి నటించిన సహ నటుడు జైతో అంజలి సన్నిహితంగా ఉంటున్నట్టు కొన్నేళ్ల కిందట కూడా రూమర్స్‌ వచ్చాయి. అయితే, అవే రూమర్స్‌ మళ్లీ కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతుండటం, ఆమె పెళ్లి గురించి కథనాలు వస్తుండటం గమనార్హం. అయితే, అంజలి సన్నిహితులు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నారు. అంజలి ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నారని, జీవితంలో స్థిరపడాలనే ఆలోచనతో ఆమె ముందుకు సాగుతున్నారని వారు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు