ఆర్మీ దాడి : రూపాయి క్రాష్

29 Sep, 2016 15:36 IST|Sakshi
గత వారం రోజులుగా బలపడుతూ వస్తున్న రూపాయి ఒక్కసారిగా కుప్పకూలింది. నియంత్రణ రేఖ వెంబడి మోహరించి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు జరిపిందని డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్( డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరవల్ రణబీర్ సింగ్ వెల్లడించడంతో, రూపాయి 46 పైసలు మేర పతనమైంది. దీంతో డాలర్కు వ్యతిరేకంగా రూపాయి 66.91గా నమోదైంది. బ్రెగ్జిట్ అనంతరం ఇదే అతిపెద్ద ఇన్ట్రా-డే పతనం. 
 
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా రూపాయి ఈ స్థాయిలోనే పడిపోయింది. 66.65 స్థాయే రూపాయికి అత్యంత కీలకమైన సపోర్టని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిమాణాలు తదుపరి రేట్ల కోత ఆశకు విఘాతం కలిగిస్తున్నాయని అంటున్నారు. భౌగోళిక రాజకీయ సమస్యలు ఆర్బీఐ పాలసీపై కూడా ప్రభావం చూపనున్నట్టు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు డీజీఎంఓ వ్యాఖ్యల అనంతరం మార్కెట్లు సైతం భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 573 పాయింట్లు నష్టపోయింది.   
మరిన్ని వార్తలు