20 నెలల గరిష్టానికి రుపీ

7 Apr, 2017 13:28 IST|Sakshi
20 నెలల గరిష్టానికి రుపీ

ముంబై: ఆర్‌బీఐ పాలసీ రివ్యూ  వచ్చిన కిక్‌తో రూపాయి మరోసారి  దూసుకుపోతోంది.   ద్రవ్యోల్బణ ఆందోళన నేపథ్యంలో ఈ సంవత్సరానికి వడ్డీరేట్ల కోత ఉండదనే  ఆర్‌బీఐ   సంకేతాలతో రూపాయి పాజిటివ్‌గా స్పందించింది. ఇటీవల రూపాయి 17 నెలల గరిష్టంవద్ద కదులుతున్న రూపాయి ఆర్‌బీఐ నిర్ణయంతో మరోసారి బలపడింది. గురువారం నాటి ముగింపు రూ. 64.52తో పోలిస్తే దాదాపు సంవత్సరన్నర గరిష్టాన్ని తాకింది. గురువారం ర్యాలీని కొనసాగించిన రూపాయి  నేడు డాలర్‌ మారకంలో  రూ. 64.32 వద్ద 2015 ఆగస్టునాటి స్థాయిని తాకింది.

 

మరిన్ని వార్తలు