డాలర్ బలం: ప్రపంచ కరెన్సీలు బేర్

15 Dec, 2016 18:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫెడ్  వడ్డీరేట్ల  పెంపుతో  ప్రపంచ కరెన్సీలు   నీరసించాయి.  ముఖ్యంగా దేశీయ కరెన్సీ  రూపాయి ఒక్కసారిగా కుదేలైంది.  ఫెడ్  వడ్డీ రేటు పావుశాతం  వడ్డనతో దేశీయ కరెన్సీలతోపాటు ఇతర ప్రపంచ కరెన్సీలు కూడా  పతనమయ్యాయి.  డాలర్ బలం, దేశీయ మార్కెట్ల బలహీనత  రూపాయిని మరింత దెబ్బతీశాయని  ఫారెక్స్ డీలర్లు తెలిపారు.  మరోవైపు విదేశీ మదుపర్ల అమ్మకాలు కూడా రూపాయిపై ఒత్తిడి పెంచాయన్నారు.
 అమెరికా ఫెడ్ పావు శాతం పాయింట్ వడ్డీ రేటు పెంచిన నేపథ్యలో డాలర్ కు డిమాండ్ పుట్టింది.   ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ కరెన్సీ డాలర్ పుంజుకుంది. దీంతో  రూపాయి 43పైసలు నష్టపోయి మళ్లీ 67.86  స్థాయికి పడిపోయింది.  చివరికి 39 పైసల నష్టానికి  పరిమితమైంది. ఇంట్రాడేలో రూపాయి రూ.67.87  67.71 మధ్య  ట్రేడ్ అయింది.    చైనా కరెన్సీ యెన్ కూడా ఎనిమిదేళ్ల కనిష్టానికి పడిపోయింది.  అటు  డాలర్ బలం, ఇటు బ్రిటన్ కేంద్ర బ్యాంకు  ప్రకటనతో  పౌండ్  కూడా రికార్డు కనిష్టాన్ని నమోదుచేసింది.
 
కాగా బుధవారం ముగిసిన పాలసీ సమీక్షలో ఫెడ్‌ వడ్డీ రేటును పావు శాతం పెంచడంతోపాటు ఇకపై రెండేళ్లపాటు ఏడాదికి కనీసం మూడుసార్లు రేట్లను పెంచే వీలున్నట్లు సంకేతమివ్వడంతో ఇన్వెస్టర్లు ఆందోళనతో మార్కెట్లో అప్రమత్తత కొనసాగింది.  దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా  నష్టాల్లో ముగిశాయి. 

 

మరిన్ని వార్తలు