కరెన్సీ నేలచూపులు

11 Nov, 2016 11:18 IST|Sakshi
కరెన్సీ నేలచూపులు

ముంబై: అమెరికా అధ్యక్షుడిగా  ట్రంప్ అనూహ్య విజయంతో  డాలర్ బాగా పుంజుకుంది. దీంతో ఇతర కరెన్సీలన్నీ  నేలచూపులు చూస్తున్నాయి.  . ఈ నేపథ్యంలో దేశీయ కరెన్సీ కూడా భారీగానే పడుతోంది. డాలరుతో మారకంలో  44 పైసలు పతనమై 67.07 వద్ద రెండు నెలల కనిష్టాన్ని నమోదు చేసింది.. తద్వారా సాంకేతికంగా కీలకమైన 67 మార్కు దిగువకు  పతనమైంది.  

కాగా ట్రంప్ విజయంతో  డాలర్  8 ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో బాగా  పుంజుకుంది. ప్రధానంగా జపనీస్‌ యెన్‌తో మారకంలో తాజాగా 3 నెలల గరిష్టాన్ని తాకింది. మరోవైపు దేశీ య సూచీలు భారీ నష్టాల్లో  ట్రేడ్ అవుతున్నాయి. పీఎస్యూ బ్యాం‍కింగ్, ఫార్మా తప్ప దాదాపు అన్ని రంగాల్లో  బలహీనంగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు