కాస్త కోలుకున్న రూపాయి..

14 Nov, 2013 01:53 IST|Sakshi

 ముంబై: దేశీ కరెన్సీ ఐదు రోజుల వరుస పతనానికి ఎట్టకేలకు అడ్డుకట్టపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ బుధవారం 41 పైసలు కోలుకొని 63.30 వద్ద స్థిరపడింది. ఎగుమతిదారులు, బ్యాంకులు తాజాగా డాలర్ల అమ్మకాలకు దిగడంతో రూపాయికి కాస్త వెన్నుదన్నుగా నిలిచిందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు చెప్పాయి. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంట్ అకౌంట్ లోటు గత అంచనాల కంటే చాలా తక్కువగా 56 బిలియన్ డాలర్లకు(జీడీపీలో 3 శాతం లోపే) పరిమితం కావచ్చని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన ప్రకటన కూడా దేశీ కరెన్సీపై సానుకూల ప్రభావం చూపింది. కాగా, గడచిన ఐదు రోజుల్లో 209 పైసలు(3.39%) పతనమై రెండు నెలల కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు