రూపాయి రికవరీకి బ్రేక్

21 Nov, 2013 01:06 IST|Sakshi

ముంబై: నాలుగు రోజులుగా రికవరీబాటలో నడుస్తున్న దేశీ కరెన్సీ మళ్లీ నష్టాల్లోకి జారింది. డాలరుతో రూపాయి మారకం విలువ బుధవారం 21 పైసలు నష్టపోయింది. క్రితం ముగింపు 62.36తో పోలిస్తే 62.57 వద్ద ముగిసింది. దిగుమతిదారులు.. ప్రధానంగా చమురు రిఫైనర్ల నుంచి తాజాగా డాలర్లకు డిమాండ్ జోరందుకోవడం, దేశీ స్టాక్ మార్కెట్ల పతనం ప్రభావంతో రూపాయి సెంటిమెంట్ బలహీనపడిందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో దేశీ కరెన్సీ 135 పైసలు(2.12శాతం) పుంజుకున్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు