రికార్డు కనిష్టానికి చేరువగా రుపీ

12 Dec, 2016 15:00 IST|Sakshi
రికార్డు కనిష్టానికి చేరువగా రుపీ


ముంబై:  విశ్లేషకులు అంచనా వేసినట్టుగా  రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మరింత క్షీణించింది.  ఇవాల్టి ట్రేడింగ్ ప్రారంభంలోనే  బలహీనపడిన రూపాయి 28పైసలు  క్షీణించి రూ.68.44 వద్ద  మరింత బలహీన సంకేతాలను అందిస్తోంది.    రికార్డు స్థాయి కనిష్టంతో  2013  ఆగస్టు నాటి 68. 85  స్తాయి వైపుగా కదులుతోంది. దీనికితోడు  నవంబరు 8  డిమానిటేజేషన్ ప్రకటన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు 12 వేల కోట్ల  పెట్టబడులను దేశీయ మార్కెట్లనుంచి ఉపసంహరించుకోవడం దేశీయ కరెన్సీని బలహీపరుస్తోంది.
అయితే ప్రారంభంలోనే 11 పైసలు నష్టోయిన రూపాయి 8 నెలల కనిష్టాన్ని నమోదుచేసింది.  డాలర్ పుంజుకోవడం,  భారీగా పుంజుకున్న అమెరికా మార్కెట్లు, డిమానిటైజేషన్   రూపాయి విలువ పతనానికి కారణంగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.మరోవైపు డెరివెటివ్  ముగింపు నేపథ్యంలో దేశీయ  స్టాక్ మార్కెట్లు కూడా స్తబ్దుగా ట్రేడ్ అవుతున్నాయి.
కాగా డిసెంబర్‌లో ఫెడ్  పెరగనున్నాయనే  అంచనాలకు తోడు యూఎస్ హోమ్ సేల్స్ డేటా  భారీగా నమోదు కావడంతో  ప్రపంచ కరెన్సీలతో పోలిస్తే డాలర్   దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు