రాజ్యసభలో సచిన్ దంపతులు

13 Dec, 2013 13:53 IST|Sakshi
రాజ్యసభలో సచిన్ దంపతులు

భారతీయ క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సతీ సమేతంగా శుక్రవారం రాజ్యసభకు హాజరయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి సారిగా సచిన్ ఆ సమావేశాలల్లో పాల్గొన్నారు. ఆ సమావేశాలలో పాల్గొనే ముందు సచిన్ దంపతులు మర్యాద పూర్వకంగా రాజసభ చైర్మన్ హమీద్ అన్సారీని కలశారు. అనంతరం సచిన్ రాజ్యసభ సభ్యులోకి ప్రవేశించారు. సచిన్ భార్య సభలోని అతిథుల గ్యాలరీలోకూర్చొన్నారు.సభలోని సభ్యులందరి కళ్లు సచిన్ దంపతులపైనే ఉన్నాయి.

పార్లమెంట్పై దాడి జరిగి 12 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్బంగా ఆ దాడిలో మరణించిన భద్రత సిబ్బందికి రాజ్యసభ సభ్యులు ఘనంగా నివాళ్లు ఆర్పించారు.అనంతరం భారతరత్న పురస్కారానికి సచిన్ టెండుల్కర్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల రాజ్యసభ చైర్మన్ హామీద్ అన్సారీ హార్షం ప్రకటించారు. సచిన్కు హమీద్ అన్సారీ రాజ్యసభ సభ్యుల తరుఫున శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజ్యసభ మధ్యాహ్నానానికి వాయిదా పడింది. అయితే సచిన్ ఆటోగ్రాఫ్ కోసం కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యార్లోపాటు పలువురు సభ్యులు పోటీ పడ్డారు.

మరిన్ని వార్తలు