సమంత మళ్లీ మాయ చేస్తుందట..!

30 Dec, 2016 09:23 IST|Sakshi
సమంత మళ్లీ మాయ చేస్తుందట..!

హైదరాబాద్:  టాలీవుడ్ లో ఎంట్రీ  ఇచ్చిన తొలి చిత్రంతోనే టాప్  లెవల్ కి ఎదిగిన  హీరోయిన్ సమంత రుతు ప్రభు(29). ఫస్ట్ మూవీతోనే యూత్  లో మాంచి క్రేజ్ కొట్టేసిన సామ్ తన మొదటి  రీల్ హీరోనే రియల్ హీరోగా ఎంచుకుంది. అయితే మళ్లీ 'ఏ మాయ చేశావే'  లాంటి  లవ్  స్టోరీ  మూవీని త్వరలోనే చేయబోతోందిట. అక్కినేని నట వారసుడు, టాలీవుడ్ టాప్ స్టార్ నాగచైతన్యతో  నటించిన'ఏ మాయ చేశావే' లాంటి మరో సినిమాను చేయబో్తోందిట. తొలి సినిమాతోనే  మాయ చేసిన ఈ అమ్మడు  త్వరలోనే  అలాంటి సినిమా  చేయబోతున్నానంటూ   స్వయంగా వెల్లడించింది.  సోషల్ మీడియాలో  ఓ అభిమాని అడిగిన  ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని చెప్పింది.
 
ఏ మాయ చేశావే లాంటి  అద్భుతమైన   ప్రేమ కథా చిత్రం మళ్లీ ఎపుడు చేయబోతున్నారని పుప్పాల గౌతం ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. దానికి సమంత సూన్ అని  సమాధానం చెప్పింది.   దీంతో మరోసారి  లవ్ స్టోరీ చేయనుందనే ఆనందంలో మునిగిపోయారట అభిమానులు.  మరోవైపు సూన్ అని సింపుల్ గా తేల్చేసిందా?  లేక  రీల్ లైఫ్ లో నిజంగానే మరోసారి మాయ చేయనుందా అనే  డైలమాలో పడిపోయారట.

అందరికీ  నూతన సంవత్సర  శుభాకాంక్షలు సమంత.. తనకు  వర్క్  పవరంగా 2017 కొంచెం కష్టమైన   సంవత్సరమని చెప్పింది. పెళ్లి తరువాత సినిమాల్లో నటిస్తానని స్పష్టంచేసిన ఈ ఏడాది5,6 సినిమాలు  చేస్తున్నట్టు వెల్లడించింది. దీంతోపాటు 2016 లో తనకిష్టమైన మూవీ దంగల్ అని చెప్పింది.

 కాగా   ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన  సమ్మూ బృందావనం, దూకుడు  ఈగ ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది , 24,  అ ఆ తదితర చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట స్టార్ హీరోయిన్ గా   ఓ వెలుగు వెలిగింది. మరోవైపు  టాలీవుడ్  సూపర్ స్టార్స్ సమంత- నాగచైతన్య ప్రేమ,  పెళ్లి ఇండస్ట్రీలో హాట్ టాపిక్. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు