సమంత, చైతు నిశ్చితార్థం డేట్ ఫిక్స్?

26 Jan, 2017 23:54 IST|Sakshi
సమంత, చైతు నిశ్చితార్థం డేట్ ఫిక్స్?


హైదరాబాద్:  టాలీవుడ్  అందమైన జంటగా అభిమానులు యాక్సెప్ట్ చేసిన  లవ్లీ కపుల్  నాగచైతన్య, సమంత నిశ్చితార్థానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైయిందట. ఈ మేరకు టాలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తమ అభిమాన జంటకు నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ అయిందన్నవార్తల అటు అభిమానులను, ఇటు  ఫిలింనగర్  ను మురిపిస్తోంది. 

ఇటీవల చైతూ  ట్విట్టర్ లో చేసిన సందడి కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది.  మరోవైపు  నాగర్జున చిన్నకుమారుడు అఖిల్ నిశ్చాతార్థం ఇప్పటికే పూర్తి కావడంతో.. ఈ శుభకార్యాన్ని కూడా  తొందరగా జరిపించాలని  నాగార్జున భావిస్తున్నారట!

చైతు, సమంతల  నిశ్చితార్థ  వేడుక   జనవరి 29న నిర్వహించనున్నారనే ఫిలింనగర్ లో గుప్పుమంది. ఇప్పటికే  ఏర్పాట్టు  ముమ్మరంగా సాగుతున్నాయనీ,  అతిథులను ఆహ్వానించే పనిలో  నాగ్ దంపతులు బిజీగా ఉన్నారనే  ప్రచారం జోరుగా  సాగుతోంది. ఈ శుభఘడియకోసం ఎదురుచూస్తున్న ఈ జంట అభిమానులకు  ఇది నిజంగా శుభవార్త.   అయితే దీనిపై అక్కినేని ఫ్యామిలీ నుంచి అధికారిక  ప్రకటన వచ్చేంతవరకు   సస్పెన్స్  మాత్రం తప్పదు.

మరిన్ని వార్తలు