మనవడిని రంగంలోకి దించిన శాంసంగ్

27 Oct, 2016 15:13 IST|Sakshi
మనవడిని రంగంలోకి దించిన శాంసంగ్
నోట్7 ఫెయిల్యూర్తో టెక్ పరిశ్రమలోనే అత్యంత దుర్భలమైన పరిస్థితి  ఎదుర్కొన్న శాంసంగ్,  మేనేజ్మెంట్లో మార్పులు చేస్తూ కొత్త డైరెక్టర్ను ఎన్నుకుంది. గురువారం షేర్ హెల్డర్స్ ఓటింగ్ అనంతరం కుటుంబ సమ్మేళన శాంసంగ్ గ్రూప్ వాస్తవ చీఫ్ జే వై లీని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్గా ఎంపికచేశారు. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీలో ఇక ఆయన అత్యంత కీలకమైన బాధ్యత నిర్వర్తించాల్సి ఉంటుంది. శాంసంగ్ వ్యవస్థాపకుడికి జేవై లీ మనవడు కాగ, చైర్మన్ లీ కున్-హికి ఈయన ఒకగానొక్క కొడుకు. ఇక ఇతను బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారని, ఇటీవల మార్కెట్లో నెలకొన్న బ్యాటరీ ముప్పుకు పరిష్కారం కనుగొన్న అనంతరం ఆయన కంపెనీ బాధ్యతలు చేపట్టనున్నారని చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్వాన్ ఓహ్-హ్యున్ తెలిపారు.
 
గెలాక్సీ నోట్7 బ్యాటరీ పేలుళ్ల ఘటన, శాంసంగ్కి మార్కెట్లో రాబడులపైనే కాక, క్రెడిబిలిటీపై కూడా తీవ్ర దెబ్బకొట్టింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ఫోన్ దిగ్గజంగా ఉన్న ఈ కంపెనీ మూడో క్వార్టర్లో మొబైల్ రాబడులు 96 శాతం క్షీణించాయి. 2008 తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. టెక్ పరిశ్రమలోనే అత్యంత దుర్భలమైన పరిస్థితి ఈ దిగ్గజం ఎదుర్కొంది.  త్వరలోనే వినియోగదారుల నమ్మకాన్ని పునఃసంపాదించుకుంటామని ఆశాభావం వ్యక్తంచేస్తోంది. కంపెనీ ఫలితాల సందర్భంగా సియోల్లో నిర్వహించిన మీటింగ్లో మార్కెట్లో తమ వైఫల్యానికి క్షమాపణ చెబుతున్నామని, మీ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి తాము శాయశక్తులా కృషిచేస్తామని కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేకే సిన్ తెలిపారు.
 
నాలుగో క్వార్టర్లో తాము రాబడులను పెంచుకుంటామని, స్ట్రాంగ్ ఫర్ఫార్మెన్స్ను నమోదుచేస్తామని కంపెనీ ఆశాభావం వ్యక్తంచేస్తోంది.  2015 నాలుగో క్వార్టర్లో ఎలాంటి ఫలితాలనైతే ప్రకటించామో అదేమాదిరి వచ్చే నాలుగో త్రైమాసికంలోనే విడుదల చేస్తామని, ప్రస్తుతం కోల్పోయిన మొబైల్ వ్యాపారాలను పునఃరాబట్టుకుంటామని స్పష్టంచేసింది. 

 

మరిన్ని వార్తలు