కుంభకోణంపై శాంసంగ్‌ క్షమాపణలు

24 Mar, 2017 15:52 IST|Sakshi
కుంభకోణంపై శాంసంగ్‌ క్షమాపణలు

సియోల్‌: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌  దిగ్గజం శాంసంగ్‌  తన వాటాదారులకు క్షమాపణలు చెప్పింది. దేశంలో అతిపెద్ద కుంభకోణంలో తమ సంస్థ అధిపతిపైఅవినీతి అభియాగాలు రావడంపై సం‍స్థ వాటాదారులకు వివరణ ఇచ్చింది. శుక్రవారం జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో అవినీతి కేసులో సంస్థ అధ్యక్షుడు జే ఓలీ అరెస్టు కావడంపై శాంసంగ్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్వాన్ ఓహ్-హ్యున్  వాటాదారులను క్షమాపణ కోరారు. కుంభకోణంలో తాము చిక్కుకున్నందుకు క్షమించాలని కోరారు.

విరాళాల రూపంలో తాము ఎలాంటి లంచాలు ఇవ్వలేదని చెప్పారు. కానీ సంస్థ  కార్పొరేట్ పాలన మెరుగుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. దీంతో హోల్డింగ్ కంపెనీగా మార్చడానికి ఇన్వెస్టర్లనుంచి ఒత్తిడి పెరుగుతోందని  కానీ,కార్పొరేట్ నిర్మాణం ఎప్పటికీ మార్చుకోలేమని శుక్రవారంనాటి సమావేశంలో క్వాన్‌ ప్రకటించారు హోల్డింగ్ కంపెనీ ద్వారా  ప్రతికూల ప్రభావాలుంటాయని పేర్కొన్నారు.అలాగే శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 7  వైఫల్యంపై కూడా మరోసారి క్షమాపణలు కోరింది. కొత్త టెక్నాలజీ ప్రయోగంలో లోపం తలెత్తినట్టు  క్వాన్‌ వివరించారు. ఈ వైఫల్యాన్ని6 బిలియన్‌ డాలర్ల మేర అంచనా వేసినట్టు చెప్పారు.

కాగా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ శాంసంగ్‌ గ్రూప్‌ చీఫ్‌ జె.వై.లీని అక్కడి విచారణ అధికారులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌నుంచి తప్పించుకునేందుకు సంస్థ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి లీ జైలుకి వెళ్లక తప్పలేదు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై విచారణ కొనసాగనుంది. దక్షిణ కొరియా అధ్యక్షునికి 38మిలియన్‌ డాలర్ల లంచం ఇవ్వజూపేందుకు ప్రయత్నించారని లీపై ప్రధాన అభియోగం. రెండు కంపెనీల వివాదానికి సంబంధించి దేశాధ్యక్షుడి మద్దతు కోసంశాంసంగ్‌ చీఫ్‌ లంచాన్నిఎరగా చూపారని చార్జ్‌షీట్‌ నమోదైంది. అటు ఈ అవినీతి ఆరోపణలు దక్షిణ కొరియాను కుదిపేయడంతో ఆ దేశ అధ్యక్షుడు మహాభియోగాన్ని కూడా ఎదుర్కొన్నారు. దీనిపై తాము కోర్టులోనే తేల్చుకుంటామని శాంసంగ్‌ వర్గాలు వాదిస్తున్న సంగతి తెలిసిందే.

 

మరిన్ని వార్తలు