కొత్త ఫోన్లపై శాంసంగ్ ఫోకస్

13 Jul, 2016 12:29 IST|Sakshi
కొత్త ఫోన్లపై శాంసంగ్ ఫోకస్

భారత్‌.. స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలకు అతి పెద్ద మార్కెట్‌.  స్మార్ట్ ఫోన్ల కంపెనీల్లో రారాజుగా ఉన్న అటు శాంసంగ్ నుంచి అన్ని కంపెనీ చూపు భారత్ వైపే. దీంతో తన రారాజు స్థానాన్ని కొనసాగించడంతో పాటు, మార్కెట్ షేరును మరింత దోచేయడానికి భారత్ లో కొత్త కొత్త ఫోన్ల ఆవిష్కరణలపై  శామ్ సంగ్ దృష్టిసారించేందుకు సిద్ధమైంది. వినూత్న లక్షణాలతో, తన స్థానాన్ని స్థిరంగా  కొనసాగిస్తూ.. మార్కెట్ షేరును మరింత సొంతచేసుకోనుందని కంపెనీకి చెందిన టాప్ అధికారులు చెప్పారు. వివిధ ధరల్లో అన్ని విభాగాల్లో స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించే దృష్టిని కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు.

ఇన్నోవేషన్ అనేది ప్రధానమైన అంశంగా.. వినూత్న లక్షణాలతో కొత్త ప్రొడక్ట్ లను భారత మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్టు శాంసంగ్ వైస్ ప్రెసిడెంట్(ప్రొడక్ట్ మార్కెటింగ్) మను శర్మ తెలిపారు. 2015 జనవరిలో 35శాతం ఉన్న మార్కెట్ షేరును ప్రస్తుతం 48.3శాతానికి పెంచుకున్నామని ప్రకటించారు. కొత్త స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణతో గతేడాది నుంచి 10 శాతానికి పైగా మార్కెట్ షేరును దక్కించున్నామని వెల్లడించారు. 4జీ మార్కెట్లో శామ్ సంగ్ మార్కెట్ షేరు 60శాతానికి పైగానే ఉందని, స్మార్ట్, ఫీచర్ వంటి అన్నిరకాల ఫోన్లలో శాంసంగ్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు.

ఫీచర్ ఫోన్ సెగ్మెంట్ లో కూడా 30శాతం మార్కెట్ షేరును కలిగిఉంది. టర్బో స్పీడ్ టెక్నాలజీ(టీఎస్టీ), స్మార్ట్ గ్లో, తర్వాతి తరం కలర్ ఎల్ఈడీ నోటిఫికేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లతో శామ్ సంగ్ నుంచి కొత్త ఫోన్లు భారత మార్కెట్లోకి రానున్నట్టు కంపెనీ తెలిపింది. టీఎస్టీ టెక్నాలజీ డివైజ్ ల పనితీరును మరింత మెరుగుపరుస్తుందని, డబుల్ ర్యామ్ డివైజ్ లకంటే 40శాతం వేగంగా నేటివ్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోగలుగుతారని శాంసంగ్ పేర్కొంది.

మరిన్ని వార్తలు