40 శాతం తగ్గిన శామ్‌సంగ్ లాభం

30 Apr, 2015 01:57 IST|Sakshi
40 శాతం తగ్గిన శామ్‌సంగ్ లాభం

సియోల్ : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ కంపెనీ నికర లాభం ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో 40 శాతం తగ్గింది. వినియోగదారులు పెద్ద సైజు యాపిల్ ఫోన్‌ల కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం, చైనా కంపెనీల నుంచి పోటీ అంతకంతకూ పెరిగిపోవడం, దక్షిణ కొరియా కరెన్సీ వాన్ బలపడడం దీనికి ప్రధాన కారణాలు. దక్షిణ కొరియా కరెన్సీ వాన్ బలపడడం వల్ల విదేశీ మార్కెట్లలో శామ్‌సంగ్ ఉత్పత్తులు ఎక్కువ ఖరీదు పలుకుతున్నాయి. దీంతో అమ్మకాలు తగ్గుతున్నాయి.

మొత్తం మీద ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో కంపెనీ నికర అదాయం 420 కోట్ల డాలర్లకు తగ్గింది. స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో యాపిల్, చైనా కంపెనీల పోటీ కారణంగా శామ్‌సంగ్ కంపెనీ లాభదాయకత తగ్గిపోయింది. కాగా కంపెనీ ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన ఎస్6 స్మార్ట్‌ఫోన్‌లు మంచి అమ్మకాలు సాధిస్తున్నాయి.

మరిన్ని వార్తలు