శాంసంగ్ కొత్త ఫోన్ ఎలా ఉంటుందో తెలుసా..?

24 Aug, 2016 11:49 IST|Sakshi
శాంసంగ్ కొత్త ఫోన్ ఎలా ఉంటుందో తెలుసా..?

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఫోన్, మరో కొత్త రూపంలో అవతరించనుందట. ఎలా అనుకుంటున్నారా..? క్లామ్షెల్ రూపంలో అచ్చం ఫ్లిప్ ఫోన్ మాదిరి ఓ కొత్త స్మార్ట్ఫోన్ను రూపొందించడంలోనే ప్రస్తుతం శాంసంగ్ నిమగ్నమై ఉందట. ఆ కొత్త స్మార్ట్ఫోన్కు గెలాక్సీ ఎస్7కు వాడిన డిజైన్నే శాంసంగ్ వాడనుందని తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ ఫోన్ కోడ్ నేమ్ "వెయ్రోన్"గా రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో గెలాక్సీ ఎస్7 క్లామ్షెల్ రూపంలో అవతరించనుందని తెలుస్తోంది. గ్లాస్, మెటల్ బాడీతో గెలాక్సీ ఎస్7 మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఫోన్ రిలీజ్ తేదీ మాత్రం ఇంకా వెల్లడికాలేదు. చైనాలోనే మొదట లాంచ్ చేయొచ్చని టాక్. గతంలో వచ్చిన రూమర్ ప్రకారం ఈ ఫోన్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగిఉంటుందని తెలుస్తోంది. మొబైల్ టెస్టింగ్ వెబ్సైట్ గీక్బెంచ్లో లిస్టు అయిన ఈ ఫోన్కు సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు ఇలా ఉన్నాయ్..

4.2 అంగుళాల డిస్ప్లే
క్వాడ్-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 820 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
మోడల్ నెంబర్ ఎస్ఎమ్-డబ్ల్యూ2017
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్మాలో
 

మరిన్ని వార్తలు