19 ఆడశిశువుల కేసులో మరిన్ని షాకింగ్‌ నిజాలు

17 Mar, 2017 19:34 IST|Sakshi
19 ఆడశిశువుల కేసులో మరిన్ని షాకింగ్‌ నిజాలు

 సాంగ్లి: 19 ఆడశిశువులను అమానుషంగా అంతం చేసిన కేసులో షాకింగ్‌ నిజాలు వెలుగు చూశాయి. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో వెలుగుచూసిన ఈ దారుణంపై విచారణ చేపట్టిన పోలీసులు మరిన్ని భయకంరమైన, కఠిన వాస్తవాలను  సేకరించారు. మంటగలిసిన మానవత్వానికి పరాకాష్టగా నిలిచిన సంగ్లీ జిల్లాలోని మైసల్‌ గ్రామంలో చోటుచేసుకున్న ఆడశిశువుల అబార్షన్లపై  వివరాలను పోలీసులు వివరించారు.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మంటగలిసిన మానవత్వానికి పరాకాష్టగా నిలిచిన సంగ్లీ జిల్లాలోని మైసల్‌ గ్రామంలో ఘటనల వివరాలను పరిశీలిస్తే...రెండు రాష్ట్రాల్లో ఎజెంట్లను నియమించుకుని మరీ ఈ దందాను  సాగిస్తున్నారు.  ఎవరికీ అనుమానంరాకుండా మహారాష్ట్ర  కేసులను, కర్ణాటకకు, కర్ణాటక కేసులను మహారాష్ట్రకు పంపిస్తారు. అంతేకాదు ఈ అబార్షన్లకోసం  డా. బారతి  ప్రయివేటు ఆసుపత్రిలో ఏకంగా భూగర్భంలో  ఒక ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఆపరేషన్ థియేటర్ కు బదులుగా  ఒక తాత్కాలిక గుడిసెలో గర్భస్రావాలు నిర్వహిస్తారు.  అంతేకాదు కొన్నిసార్లు , కాంపౌండర్లు లేదా నర్సులే ఈ పనిని పూర్తి  చేస్తారట.  అనంతరం ఆ పిండాలను పాతిపెట్టడం, లేదా టాయిలెట్‌ లో యాసిడ్‌ తో కలిసి ప్లష్‌ చేస్తారు లేదంటే కుక్కలకు ఆహారంగా వేస్తారు.
కానీ  మొన్నటి ఘటనలో ప్లాస్టిక్‌సంచుల్లో కుక్కి  పాతిపెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  దీనికి గాను వారు రూ.25వేలు చార్జ్‌ చేస్తారు.   గర‍్భంలో ఉన్నది ఆడబిడ్డ అయితే అబార్షన్‌  చేస్తారు.. అబ్బాయి అయితే.. ఆ విషయం చెప్పినందుకు ఈ  చార్జ్‌ వసూలు  చేస్తారు.  

ఈ కేసు దర్యాప్తులో భాగంగా   మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దులో జరుగుతున్న  అబార్షన్లపై  పోలీసులు ఆరా తీయగా రాకెట్టు గుట్టురట్టయింది.  ఈ కేసులో  డా. బాలాసాహెబ్‌ ఖిద్రాపూర్‌ సహా  ఇప్పటికీ12 మందిని అరెస్ట్‌ చేశారు.  ఇందులో  ముగ్గురు  వైద్యులు.  డా. బాలాసాహెబ్‌ ఖిద్రాపూర్‌ , డాక్టర్ శ్రీహరి గోడ్కే,  విజపూర్ నుంచి డాక్టర్ రమేష్ దేవిగర్‌ (ఎంబీబీఎస్‌). ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని  ఈకేసును పరిశోధిస్తున్న  డిప్యూటీ సూపరింటెండెంట్ దీపాలి కాలే  చెప్పారు.

అయితే ఆసుపత్రిపై దాడులు నిర్వహించామనీ, తమకు   అనుమానాస్పద సమాచారం దొరకలేదనీ,  ఎలాంటి చర్యలు తీసుకోలేదని హెల్త్‌ సర్వీసెస్‌   అడిషనల్‌ డైరెక్టర్‌ అర్చనా పాటిల్‌ తెలిపారు.  మరోవైపు గతంలో కూడా ఇదే డాక్టర్‌ పై కేసులు నమోదయ్యాయి. అపుడు వైద్య అధికారులు ఏమీ లేదని తేల్చిపారేశారు. అయితే ఈ సారి పోలీసుల దర్యాప్తులో మాత్రం అక్రమంగా వాడుతున్న మందులు, అక్రమ థియేటర్‌  తదితర విషయాలు తేలాయి. అసలు  సదరు డాక్టర్‌కు ఆపరేషన్‌ నిర్వహించే  అనుమతి కూడాలేదని పోలీసులు స్పష్టం  చేశారు.

 క్రిమినల్‌ కోణం ఉంటేనే తమ దర్యాప్తు కొనసాగుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. స్వాతి మరణంపై తమ దర్యాప్తు కొనసాగుతుందన్నారు.  అయితే ఆరోగ్య అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని  ప్రశ్నిస్తున్నారు.  ఆరోగ్య  అధికారులు కేవలం ఒకసారి రెయిడ్‌ చేసి ఏమీ దొరకలేదని చెపుతున్నారనీ, ఇందులో మరిన్ని కోణాలుదాగి వున్నాయనే అనుమానాలను దర్యాప్తు అధికారి  వ్యక్తం  చేశారు.

కాగా  రాష్ట్రంలోని సాంగ్లి , బీడ్ జిల్లాలు రెండూ అత్యల్ప చైల్డ్ సెక్స్  రేషియో   నమోదు చేశాయి. ముఖ్యంగా  బీడ్ లో 1991 నుంచి లింగ నిష్పత్తి క్రమంగా పడిపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు