జిమ్‌ను వేడెక్కిస్తున్న భామలు!

30 May, 2017 15:57 IST|Sakshi
జిమ్‌ను వేడెక్కిస్తున్న భామలు!

ఫిట్‌నెస్‌ మీద బాలీవుడ్‌ భామలకు ఫోకస్‌ ఎక్కువే. నిన్నటికినిన్న కత్రినా కైఫ్‌ తన జిమ్‌ వర్కట్స్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో హిట్‌ పెంచగా.. తాజాగా ‘కెవ్వు కేక’  భామ మలైకా అరోరా జిమ్‌ ఫొటోలతో మరింత వేడెక్కించింది. 43 ఏళ్ల మలైకాకు జిమ్‌ వర్కౌట్స్‌ అంటే చాలా ఇష్టం. ఆమెకు జిమ్‌లో ఒక కొత్త ఫ్రెండ్‌ దొరికిందట. ఆమెనే సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సరా అలీఖాన్‌. ఇటీవల సరాతో కలిసి కసరత్తులు చేస్తున్న ఫొటోను ఒకదాన్ని మలైకా పోస్టు చేసింది.

మలైక-కరీనా కపూర్‌ మంచి స్నేహితులు. ఆ రకంగా కరీనా భర్త సైఫ్‌కు కూడా ఆమె సన్నిహితురాలే. కాబట్టి సరా, మలైకా జిమ్‌లో కలిసి వర్కౌట్స్‌ చేయడం ఆశ్చర్యమేమి కాదని బాలీవుడ్‌ జనాలు అంటున్నారు. ‘మూడు కోతులు ఇలా వేలాడుతున్నాయి. ఎందుకని నన్ను అడగకండి. ఇలా చేయడం మాకు ఎంతో సరదాగా ఉంది’అంటూ సరా, నమ్రత పురోహిత్‌తో జిమ్‌లో దిగిన ఫొటోను మలైక షేర్‌ చేసింది.

స్టార్‌ కిడ్‌గా ఇప్పటికే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న సరా త్వరలోనే సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ సరసన కేదార్‌నాథ్‌ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం కానుంది. ఈ సినిమాలో అందంగా కనిపించేందుకు ఇప్పటినుంచే ఈ చిన్నది జిమ్‌లో కష్టపడుతున్నది. అటు మలైకాతోనే కాదు ఇటు నటి నిమ్రత కౌర్‌తోనూ కలిసి జిమ్‌లో చెమటోడుస్తున్నది.


Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు