శని ఉపగ్రహంపై భారీ సముద్రం

17 Sep, 2015 01:24 IST|Sakshi
శని ఉపగ్రహంపై భారీ సముద్రం

వాషింగ్టన్: శనిగ్రహం ఉపగ్రహమైన ‘ఎన్సెలాడస్’ మొత్తం నీటితో నిండి ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసా పంపిన కాసిని వ్యోమనౌక ‘ఎన్సెలాడస్’ను పలుమార్లు సమీపం నుంచి పరిశీలించింది. కేవలం 500 కి.మీ. వ్యాసం ఉన్న ‘ఎన్సెలాడస్’.. 35 నుంచి 40 కి.మీ. మందంతో దట్టమైన మంచుపొరతో కప్పబడి ఉంటుంది. అయితే దీని దక్షిణ ధ్రువం వద్ద ఉన్న పగుళ్ల నుంచి పెద్ద మొత్తంలో నీటి ఆవిరి, మంచు కణాలు, కొన్ని సాధారణ మూలకాల కణాలు బయటకు వెదజల్లుతుండడాన్ని కాసిని తీసిన చిత్రాల్లో గుర్తించారు. అంతేగాకుండా ‘ఎన్సెలాడస్’ శని చుట్టూ పరిభ్రమిస్తున్నప్పుడు కొన్ని ప్రదేశాల్లో కొద్దిగావేగం పెరుగుతోందని, మరికొన్ని సార్లు వేగం స్వల్పంగా తగ్గుతోందని గమనించారు.

మరిన్ని వార్తలు