ఆయేషా కేసు: హైకోర్టు సంచలన తీర్పు

31 Mar, 2017 13:11 IST|Sakshi
ఆయేషా కేసు: హైకోర్టు సంచలన తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషామీరా హత్యకేసులో ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతడికి లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని తెలిపింది. తగిన ఆధారాలు ఏవీ లేకుండా సత్యంబాబును ఎనిమిదేళ్ల పాటు జైల్లో ఉంచినందుకు పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.

కాగా ఇంతకుముందు ఈ కేసులో సత్యంబాబుకు విజయవాడ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పట్లో ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం కూడా సత్యంబాబు నిర్దోషి అని, అసలు నిందితులైన కోనేరు రంగారావు బంధువులను వదిలిపెట్టి ఇతడిని ఇరికించారని చెప్పారు. ఇప్పుడు ఆమె చెప్పిన విషయాలతో హైకోర్టు కూడా ఏకీభవించినట్లు అయ్యింది.

>
మరిన్ని వార్తలు