సౌదీలో వలసకార్మికులకు పన్నుపోటు

26 Feb, 2017 05:32 IST|Sakshi
సౌదీలో వలసకార్మికులకు పన్నుపోటు

కొత్త విధానం అమలులోకి తెచ్చిన ప్రభుత్వం

మోర్తాడ్‌: సౌదీలో వలస కార్మికులపై అక్కడి ప్రభుత్వం పన్నుపోటు వేసింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త చట్టాన్ని అమలులోకి తీసు కొచ్చిన ప్రభుత్వం వలస కార్మికులపై ఆర్థిక భారాన్ని మోపింది.

సౌదీ వలసకార్మికుల్లో ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. ఇదివరకు అరబ్బుల నుంచి ఆజాద్‌ వీసా పొంది ఎక్కడైనా పని చేసుకునే అనుమతి పొందారు.  కార్మికులను యజ మానులు వేధించినా.. హింసించినా, సరైన వేతనం ఇవ్వకపోయినా కఠిన శిక్షలు వేస్తా మని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అంతే గాక వలసదారులు  యజమానిని మార్చు కునే అవకాశం ఉంది. 

కానీ, కొత్త చట్టం వలస కార్మికుల పాలిట గుదిబండగా మార నుందనే ఆవేదన వ్యక్తమవుతోంది. గతంలో ఆజాద్‌ వీసా పొందిన కార్మికులు రెండేళ్లకు ఒకసారి మన కరెన్సీలో రూ. 60 వేలు అక్కడి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండేది. వీసా ఇచ్చిన అరబ్బుకు నెలకు రూ. 3 నుంచి రూ. 5 వేల వరకు చెల్లిస్తే సరిపోయేది.

కానీ, తాజా చట్టం ప్రకారం ఆజాద్‌ వీసాపై అక్కడ ఉంటు న్న వారు సౌదీ ప్రభుత్వానికి ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.75 వేల వరకు చెల్లించాల్సి వస్తుంది. వీసా ఇచ్చిన అరబ్బుకు రూ.10 వేల వరకు చెల్లించాలి. కార్మికులకు మన కరెన్సీలో నెలకు రూ.20 వేలకు మించి వేత నం లభించదు. నెలలో సంపాదించే మొత్తం లో వీసా ఇచ్చిన వ్యక్తికి చెల్లించే మొత్తం పోను నివాసం, భోజనానికి కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏడాదికి ఒకసారి సౌదీ ప్రభుత్వా నికి పన్ను రూపంలో చెల్లించడానికి జమ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన సౌదీలో పని చేయడానికి బదులు స్వదేశంలో ఉండట మే మేలని కార్మికులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు