ఎస్‌బీహెచ్ డిపాజిట్ పథకానికి అనూహ్య స్పందన

2 Jan, 2014 03:13 IST|Sakshi
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ‘ఎస్‌బీహెచ్-150 రోజులు’ పేరుతో ప్రవేశపెట్టిన పరిమిత కాల డిపాజిట్ పథకానికి అనూహ్య స్పందన లభించింది. కేవలం పది రోజుల్లో ఈ పథకం ద్వారా రూ. 1,500 కోట్లకు పైగా డిపాజిట్లను సేకరించినట్లు ఎస్‌బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎం. భగవంతరావు ‘సాక్షి’కి తెలిపారు. డిమాండ్ బాగుండటంతో ఈ పథకాన్ని  ఈ నెలాఖరు వరకు పొడిగించుతున్నట్లు తెలిపారు.  కేవలం 150 రోజుల కాల పరిమితి గల ఈ డిపాజిట్ పథకంపై ఎస్‌బీహెచ్ 9.15 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. డిసెంబర్ 9న ప్రవేశపెట్టిన ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడానికి తొలుత డిసెంబర్ 31 చివరి తేదీ అని ప్రకటించినా ఇప్పుడు దీన్ని మరో నెల రోజులు పొడిగించారు. ఈ పథకంలో ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) కూడా ఇన్వెస్ట్ చేయచ్చు.
 

మరిన్ని వార్తలు