ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల సమ్మె

5 Jun, 2015 01:20 IST|Sakshi
ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల సమ్మె

ముంబై : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అనుబంధంగా ఉన్న ఐదు బ్యాంకుల ఉద్యోగులు గురువారం సమ్మె చేశారు. ఎస్‌బీఐ విలీన ప్రతిపాదనకు నిరసనగా వారు ఈ సమ్మెను నిర్వహించారు. ఐదు బ్యాంకుల్లో  స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్,  స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా ఉన్నాయి. ఎస్‌బీఐ యాక్ట్ పరిధికి వెలుపల ఉండాలని అసోసియేట్స్ బ్యాంకుల ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) పేర్కొంది.

మరోవైపు, ఉద్యోగుల సమ్మె.. అనుబంధ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకమైనది కాదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. అనుబంధ బ్యాంకులను ఎస్‌బీఐ నుంచి డీలింక్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారని పేర్కొంది. 24న దేశవ్యాప్త సమ్మె..: అనుబంధ బ్యాంకు ఉద్యోగుల డిమాండ్‌పై ఎస్‌బీఐ యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకోకపోతే, జూన్ 24వ తేదీన వారికి మద్దతుగా దేశ వ్యాప్త బ్యాంకింగ్ సమ్మెకు పిలుపునిస్తున్నట్లు సైతం ఏఐబీఈఏ పేర్కొంది.

మరిన్ని వార్తలు