బేస్ రేట్ తగ్గించిన ఎస్‌బీహెచ్

3 May, 2015 00:58 IST|Sakshi
బేస్ రేట్ తగ్గించిన ఎస్‌బీహెచ్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కనీస రుణ రేటును (బేస్ రేటు) 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పటి వరకు 10.2 శాతంగా ఉన్న బేస్ రేటును 10.05 శాతానికి తగ్గించామని, ఈ తగ్గిన వడ్డీరేట్లు మే 1 నుంచి అమల్లోకి వచ్చాయని ఎస్‌బీహెచ్ ఒక ప్రకటనలో తెలియజేసింది. బేస్ రేటు ఆధారంగా ఫ్లోటింగ్ రేటుపై రుణాలు తీసుకున్న వారికిది ఉపశమనం కలిగిస్తుందని, అలాగే కొత్తగా తీసుకునే వారికి ఈ తగ్గింపు రేట్లు వర్తిస్తాయని బ్యాంక్ పేర్కొంది. దీంతో పాటు హోమ్‌లోన్స్‌పై వడ్డీరేట్లను ఎస్‌బీహెచ్ తగ్గించింది. రూ.75 లక్షల వరకు గృహరుణాలను 101.10 శాతానికి, అంతకంటే ఎక్కువ మొత్తానికి తీసుకునే గృహ రుణాలను 10.15 శాతానికి తగ్గించింది. గతంలో ఎస్‌బీహెచ్ 10.25 శాతం వడ్డీని వసూలు చేసేది. ఈ తగ్గిన గృహరుణాల రేట్లు సోమవారం (మే 4) నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
 

మరిన్ని వార్తలు