బేస్‌ రేటు కోత: ఎస్‌బీఐ బంపర్‌ బొనాంజా

3 Apr, 2017 17:09 IST|Sakshi
బేస్‌ రేటు కోత: ఎస్‌బీఐ బంపర్‌ బొనాంజా

న్యూఢిల్లీ:  దేశీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  తన ఖాతాదారులకు బంపర్‌ బొనాంజా ప్రకటించింది.   బేస్‌ రేటులో 15 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. అనుబంధ బ్యాంకుల  విలీనంతో అతిపెద్ద బ్యాంకు గా అవతరించిన 48 గంటల లోపే  పాత వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది.  దీంతో ప్రస్తుత బేస్‌రేటు 9.1 శాతంగా ఉండనుంది. ఈ   రేట్లు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు  తెలిపింది.

గృహ, వాహనాలపై పాత రుణాలపై (మార్చి 31, 2016కు ముందు తీసుకున్న రుణాలు)  వడ్డీరేటులో కోత పెట్టింది. గృహ, వాహన రుణాలపై ప్రస్తుత రేటు 9.1 శాతంగా  నిర్ణయించింది. అయితే ఎంసీఎల్‌ఆర్‌ ను యథతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించింది.   ఎస్‌బీఐ జనవరిలో ప్రకటించిన వార్షిక రుణ వడ్డీరేట్లను 8 శాతం వద్ద, రెండు సంవత్సరాల  వడ్డీరేటును 8.1 శాతం వద్ద యథాతథంతా ఉంచింది.

కాగా ఎంసీఎల్‌ఆర్‌కు బేస్‌రేటుకు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండటంతో పాత రుణాలపై అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తోదని ఖాతాదారులు అందోళనవ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.  ఉదాహరణకు ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ ప్రస్తుతం 8శాతంగా ఉండగా బేస్‌ రేటు 9.25శాతం ఉంది. గత పదిహేను నెలల్లో ఎస్‌బీఐ తన ఎంసీఎల్‌ఆర్‌ను దాదాపు 1.20శాతంతగ్గించగా బేస్‌రేటును మాత్రం కేవలం 0.05శాతం తగ్గించింది.  అయితే అంచనాల ప్రకారం మొత్తం ఫ్లోటింగ్ రేటు రుణాల్లో కేవలం 30-40శాతం ఎంసీఆల్‌ ఆర్‌ ఆధారిత లోన్లుకాగా మిగిలిన రుణాలు బేస్‌ రేట్‌ ఆధారితం.

మరిన్ని వార్తలు