తీపి కబురు: వడ్డీ రేటు తగ్గించిన ఎస్ బీఐ

1 Jan, 2017 18:29 IST|Sakshi
తీపి కబురు: వడ్డీ రేటు తగ్గించిన ఎస్ బీఐ
భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ) రుణాలపై వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. పలు రకాల మెచ్యురిటీలపై 0.9శాతం వడ్డీని తగ్గిస్తున్నట్లు పేర్కొంది. తగ్గింపు వడ్డీ రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని చెప్పింది.  దీంతో గతంలో ఖాతాదారులు తీసుకున్న రుణాలపై 0.9 శాతం వడ్డీ రేటు తగ్గింది. కాగా, 2015 నుంచి ఇప్పటివరకు ఎస్ బీఐ రెండు శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించింది.
 
గత వారం ఎస్ బీఐకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ 0.3 శాతం వడ్డీ రేటును తగ్గించగా, ఐడీబీఐ బ్యాంకు 0.6 శాతం వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఎస్ బీఐ నిర్ణయంతో మిగిలిన జాతీయ బ్యాంకులు కూడా ఎస్ బీఐ దారిలో నడిచే అవకాశం ఉంది.
మరిన్ని వార్తలు