సైబర్ ఎటాక్లో ఎస్బీఐ నష్టం ఎంత?

21 Oct, 2016 13:53 IST|Sakshi
సైబర్ ఎటాక్లో ఎస్బీఐ నష్టం ఎంత?

ముంబై: ఆరు లక్షలకు పైగా డెబిట్ కార్డులను బ్లాక్ చేసినట్టు ధృవీకరించిన ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ కార్డు వినియోగదారుల  గుండెల్లో  బాంబు పేల్చింది.  హితాచీ పేమెంట్స్‌ సర్వీసెస్‌లో మాల్‌వేర్‌ ఇనెక్షన్‌ వల్లే ఈ సమస్య తలెత్తిందని  చెబుతున్న ఈ భారీ  సైబర్ దాడిలో దాదాపు 30 లక్షల కార్డులు ప్రభావితమయ్యాయి.  ప్రభుత్వరంగ బ్యాంకుల సొంత ఏటీఎంలలో ఇబ్బంది ఏమీ రాలేదని మిగిలిన ప్రభుత్వ బ్యాంకులు చెబుతున్నప్పటికీ అతిపెద్ద ప్రభుత్వంరంగ బ్యాంకు ఎస్బీఐ మాత్రం అతిపెద్ద బాధితురాలిగా మిగిలింది. దాదాపు 12.5లక్షల రూపాయలను నష్టపోయినట్టు ఇది మరింత పెరిగే అవకాశ ఉందని తెలుస్తోంది.మరోవైపు  19 బ్యాంకుల నుంచి 641  ఫిర్యాదులు అందాయనీ  బ్యాంకుల ప్రకటన ఆధారంగా  ఇప్పటివరకు 1.3 కోట్ల  నష్టం జరిగినట్టు ఎన్పీసీఐ ధృవీకరించింది. అటు ఎస్బీఐ ఏటిఎం సెంటర్లను మాత్రమే వాడాలని, మరో వారం పదిరోజుల్లో బ్లాక్ చేసిన  కార్డుల స్తానంలో  కొత్త కార్డులు జారీ చేయనున్నట్టు చీఫ్ జనరల్ మేనేజర్ (కోలకత్తా  సర్కిల్ ) పార్థా ప్రతీం సేన్ గుప్త శుక్రవారం తెలిపారు.

 రెండు రోజులు ప్రకంపనలు  రేపుతున్న ఈ వ్యవహారంలో  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే  జోక్యం చేసుకుంది.ప్రభుత్వ ఆధికారులు అందించిన  సమాచారం ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు  బ్యాంక్  చైర్మన్ అరుంధతి భట్టాచార్య తో మాట్లాడుతున్నారు అవసరమైన చోట డెబిట్ కార్డుల జారీచేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని  ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కి సూచించారు. బ్యాంక్ వినియోగదారుల రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టామని  ఆర్థిక మంత్రిత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.  దాదాపు అన్ని  డెబిట్  కార్డులను  పూర్తి ఉచితంగా రీప్లేస్ చేయేందుకు  బ్యాంకులు నిర్ణయించాయని చెప్పారు.

కాగా  ప్రస్తుతం ప్రభావితమైన కొన్ని డెబిట్ కార్డులను స్తంభింప చేసి, కొత్తవి  జారీ చేస్తున్నామనీ,  దీంతోపాటుగా పిన్ నెంబర్లు మార్చుకోవాల్సిందిగా మరికొందరికిసూచించినట్లు ఎస్‌బీఐ అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా మే,జులై మధ్య అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టుగా సెప్టెంబరులో గుర్తించినట్లు ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మంజు అగర్వాల్‌   ప్రకటించిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు