బ్యాంకుల రేటింగ్ కట్

24 Sep, 2013 02:41 IST|Sakshi

ముంబై: వివిధ అంశాలకు సంబంధించి భారత్ బ్యాంకింగ్ సామర్థ్యాలపై అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు మూడీస్, ఫిచ్ దృష్టి సారించాయి. ఆయా అంశాలకు సంబంధించి  రేటింగ్‌లపై  కోత పెట్టాయి.
 
 ఎస్‌బీఐపై మూడీస్ ఇలా...
 భారత బ్యాంకింగ్ దిగ్గజం  ఎస్‌బీఐ డెట్ రేటింగ్‌కు  మూడీస్ కోతపెట్టింది. ప్రస్తుత ‘బీఏఏ2’ రేటును ‘బీఏఏ3’కి డౌన్‌గ్రేడ్ చేస్తున్నట్లు సోమవారం తెలిపింది. సీనియర్ అన్‌సెక్యూర్డ్ డెట్, లోకల్ కరెన్సీ డిపాజిట్ రేటింగ్‌లపై ఈ కోత పెడుతున్నట్లు వెల్లడించింది. మొండిబకాయిల సమస్య, పునఃపెట్టుబడులు జరగవేమోనన్న సందేహాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీనిపై వ్యాఖ్యలకు ఎస్‌బీఐ వర్గాలు తక్షణం అందుబాటులో లేవు.
 
 పీఎన్‌బీ, బీఓబీ రేటింగ్‌లకు ఫిచ్ కోత
 కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) లాభదాయకతకు సంబంధించిన వయబిలిటీ రేటింగ్స్‌ను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తగ్గించింది. ఇప్పటివరకూ ఈ రేటింగ్ ‘బీబీబీ’కాగా దీనిని ‘బీబీప్లస్’కు కుదిస్తున్నట్లు వెల్లడించింది. బ్యాంకుల రుణ సామర్థ్యానికి ఈ రేటింగ్ ప్రతిబింబంగా ఉంటుంది. కాగా దీర్ఘకాలిక ఇష్యూయెర్ డిఫాల్ట్ రేటింగ్స్‌ను మాత్రం ‘బీబీబీ’గా కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.  
 
 మరికొన్ని  నిర్ణయాలు ఇవీ...: కాగా ఇండియన్ బ్యాంక్ దీర్ఘకాలిక (ఎల్‌టీ) ఇష్యూయెర్ డిఫాల్ట్ రేటింగ్ (ఐడీఆర్)ను ‘బీబీబీ’ నుంచి ‘బీబీప్లస్’కు తగ్గిస్తున్నట్లు ఫిచ్ తెలిపింది. ఆ బ్యాంక్ వయబిలిటీ రేటింగ్‌ను సైతం ‘బీబీబీ’ నుంచి ‘బీబీప్లస్’కు కోతపెడుతున్నట్లు వెల్లడించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరాబ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, బీఓబీ న్యూజిలాండ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్  దీర్ఘకాలిక ఇష్యూయెర్ డిఫాల్ట్ రేటింగ్స్ ‘బీబీబీ’గా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ విషయంలో వయబిలిటీ రేటింగ్స్ ‘బీబీబీ’గా కొనసాగుతుందని పేర్కొంది. కాగా కెనరాబ్యాంక్‌కు సంబంధించి ఈ రేటింగ్ ‘బీబీప్లస్’కాగా,  ఐడీబీఐ బ్యాంక్ విషయంలో ‘బీబీ’గా కొనసాగుతుందని వెల్లడించింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

పాక్‌పై నిప్పులు చెరిగిన ఆఫ్ఘాన్‌‌..

ప్రపంచంలోనే ఖరీదైన దౌత్య భవనం

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మనసును తాకే ‘మల్లేశం’

ఒక్క సెట్‌ కూడా వేయకుండానే..!

‘మన్మథుడు 2’ ఫ్రీమేకా..?

టీజర్‌ చూసి స్వయంగా చిరు ఫోన్‌ చేశాడట!

‘ఏజెంట్‌ ఆత్రేయ’కు సుప్రీం హీరో సాయం

రైటర్‌గా విజయ్‌ దేవరకొండ