పరీక్షలు ముగిసిన ఆనందంలో కారు నడిపి!

20 Apr, 2017 10:49 IST|Sakshi
పరీక్షలు ముగిసిన ఆనందంలో కారు నడిపి!

12వ తరగతి (ఇంటర్‌) పరీక్షలు ముగిసిపోయాయన్న ఆనందంతో ఓ స్కూల్‌ విద్యార్థి అడ్డగోలుగా కారు నడిపి.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. ముగ్గురు స్నేహితులను వెంటపెట్టుకొని గురువారం తెల్లవారుజామున కారులో విహరిస్తూ అతడు పేవ్‌మెంట్‌ మీద పడుకుంటున్న అభాగ్యులపై వాహనాన్ని నడిపాడు. దీంతో ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది.

ఢిల్లీ కాశ్మీర్‌గేట్‌ సమీపంలో గురువారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో కారులో దూసుకొచ్చిన 12వ తరగతి విద్యార్థి ఈ ప్రమాదానికి ఒడిగట్టాడు. మైనర్‌ అయిన సదరు విద్యార్థి ఓ టాప్‌ స్కూల్‌లో చదువుతున్నట్టు తెలుస్తోంది. అతనితోపాటు కారులో ఉన్న అతని ముగ్గురు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని సమాచారం.
 

మరిన్ని వార్తలు