అతి పురాతన శిలాజం ఇదే.!

2 Mar, 2017 22:40 IST|Sakshi
అతి పురాతన శిలాజం ఇదే.!

టొరంటో: ఇంత వరకు భూమ్మీద ఉన్న అతి పురాతన శిలాజాలాన్ని కనుగొన్నారు కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు. అతి పురాతన జీవంకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన ఈ శిలాజం దాదాపు నాలుగున్నర కోట్ల కంటే ముందు కాలానికి చెందిదని పరిశోధకులు చెబుతున్నారు. కెనడాలోని క్యూబెక్‌కు సమీపంలో గల ‘నువ్యాగిట్టుక్‌ సుప్రక్రస్టల్‌ బెల్ట్‌’ (ఎన్‌ఎస్‌బీ)లోని రాళ్లలో ఈ శిలాజాలం బయటపడింది. ఈ ఎన్‌ఎస్‌బీలో ‘ఉష్ణజలీకరణ బిలం’ పద్ధతి ద్వారా ఏర్పడిన అవక్షేప శిలలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌కు చెందిన మాథ్యుడాడ్‌ మాట్లాడుతూ... ‘ఇప్పటి వరకు చేసిన ఆవిష్కరణల ద్వారా తెలిసిన విషయమేమిటంటే... జీవం వేడి నుంచే పుట్టింది. భూమిపై నీరు, జీవం ఆవిర్భవించిన సమయంలోనే అంగారుకునిపై కూడా నీరుందని తేలింది’ అని తెలిపారు. దీంతో పాటు కొన్ని ఖనిజ శిలాజాలను కూడా గుర్తించామని మరో శాస్త్రవేత్త డొమినిక్‌ పపినీయు పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ భూమిపై ఉన్న జీవ చరిత్రతో పాటు విశ్వంలోని మిగత గ్రహాలపై జీవి మనుగడను గుర్తించడానికి ఉపోయగపడుతుందని పపినీయ అభిప్రాయపడ్డారు. ఈ ఆవిష్కరణ కంటే ముందు ఆస్ట్రేలియాలో సుమారు 3కోట్ల ఏళ్ల క్రితంనాటి శిలాజాన్ని గుర్తించారు.

>
మరిన్ని వార్తలు