స్కూటర్, మోటార్‌ సైకిళ్ళ ధరలు పెరుగుతాయట!

25 Mar, 2017 16:09 IST|Sakshi

న్యూఢిల్లీ:  దేశీయంగా ద్విచక్ర వాహనాల ధరలు  పెరగనున్నాయిట. వచ్చే నెల 1 నుంచి బీఎస్-4 ఉద్గార నిబంధనలుమ అమల్లోకి రానున్న  కారణంగా వాహన ధరలు 6-8 శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.  ఈ  నిబంధనలకు  లోబడి అన్ని వాహనాలను రూపొందించాలన్న ఆదేశాల నేపథ్యంలో  ఏప్రిల్‌ 1 నుంచి ధరలు పెరిగనున్నాయట. మార్చి 31 నుంచి  భారత్ స్టేజ్-4(బీఎస్-4) ఉద్గార నియమ నిబంధనలు అన్ని వాహన తయారీ సంస్థలకు వర్తించనున్న నేపథ్యంలో ఈ పెరుగదల తప్పదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

పలు విభాగాలకు చెందిన వాహనాలు వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయన్న కారణంతో  పర్యావరణ కమిటీ పిటిషన్‌ స్పందించిన   సుప్రీంకోర్టు  ఈ ఆదేశాలు జారీ  చేసింది. మరోవైపు  ఉద్గార నిబంధనలను కఠినంగా అమలు చేయాలని  ప్రభుత్వం  కూడా యోచిస్తోంది.  

అయితే కార్ల తయారీ కంపెనీలు మరియు డీలర్లు సుప్రీంను ఆశ్రయించారు. 9 లక్షలకు పైగా వాహనాలు డీలర్ల దగ్గర పెండింగ్‌ లో ఉన్నాయని,  దేశవ్యాప్తంగా సుమారు  20వేల మంది కోట్ల రూపాయలు నష్టపోతారని, వేల ఉద్యోగాలు కోల్పోతామని,   డీలర్లు ఫెడరేషన్‌ ఆప్‌ డీలర్స్‌ అసోసియేషన్‌   వాదిస్తోంది.   సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసింది.  పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ  పిటిషన్‌ సుప్రీం  ఆదేశాలను రివ్యూ  చేయాలని కోరింది.  

ఇప్పటికే దాదాపు అన్ని కార్ల కంపెనీలు ఈ నిబంధనలను పాటిస్తున్ననేపథ్యంలో .. ఈనిబంధనలను అమలుకు ముందు టూ వీలర్‌,  ఇతర కమర్షియల్‌ వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉందని

ఏంజిల్  బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎనలిస్ట్‌   శ్రీకాంత్‌ అకోల్కర్‌ చెప్పారు.  6-8శాతం ధరల సవరణ చూడగలమన్నారు.  అయితే  బిఎస్-4 ప్రమాణాలను  చాలా ప్యాసింజర్ వాహన తయారీదారులు ఇప్పటికే  అనుసరిస్తునందున,  ఆ తర్వాత  దీని  ప్రభావం మొత్తం రంగంపై తటస్థంగా ఉంటుందన్నారు.  

అటు గడువును పొడిగించాల్సిన అవసరం లేని డైమ్లర్‌ ఇండియా సీఈవో  ఇటీవల  ప్రకటించారు. అలాగే గడువు పెంపును  వాహన పరిశ్రమ కోరడం లేదని  సియామ్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌ దాసరి చెప్పారు.  కొందరు  పర్యావరణ కార్యకర్తలు చేస్తున్న ప్రచారం  పూర్తిగా అవాస్తవమని  ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.   

మరోవైపు  దీనిపై నివేదిక సమర్పించాల్సిందిగా   సుప్రీంకోర్టు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) ను  కోరింది.  డిసెంబర్‌2015 మార్చి 24 తరువాత తయారైన బీఎస్‌-3 వాహనాలపై నెలవారీ  వివరాలు సమర్పించాలని కోరింది.   ఈ గడువును పొడిగించే విషయంలో వాహన పరిశ్రమ రెండు వర్గాలు చీలిపోయాయి . గడుపు పెంపు పై ఆశాభావంతో ఉన్నారు.  మరి సుప్రీంతీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.
 

 

మరిన్ని వార్తలు