నెల రోజులు దాటినా.. దొరకని విమానం

8 Apr, 2014 11:43 IST|Sakshi
నెల రోజులు దాటినా.. దొరకని విమానం

మలేషియా విమానం అదృశ్యమై నెల రోజులు దాటిపోయినా ఇప్పటికీ దాని ఆచూకీ దొరకట్లేదు. ఎప్పుడో మార్చి 8వ తేదీన కనపడకుండా పోయిన ఈ విమానం కోసం గాలింపు చర్యలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 11 సైనిక విమానాలు, మూడు పౌర విమానాలు, 14 నౌకలతో మంగళవారం కూడా ఎంహెచ్370 విమానం కోసం గాలిస్తున్నట్లు అంతర్జాతీయ గాలింపు బృందాలతో ఏర్పాటైన జేఏసీసీ తెలిపింది. దాదాపు 77,580 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ గాలింపు సాగుతోంది.

ఆస్ట్రేలియన్ నౌక ఓషన్ షీల్డ్ సాయంతో ఉత్తరం వైపు జల గర్భంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే, దక్షిణం వైపు చైనాకు చెందిన హైసున్ 01, బ్రిటిష్ నౌక హెచ్ఎంఎస్ ఇకో గాలిస్తున్నాయి. విమానం బ్లాక్ బాక్స్ నుంచి వస్తున్న సిగ్నళ్లను గత వారాంతంలో హౌసున్ 01, ఓషన్ షీల్డ్ నౌకలు గుర్తించాయి. అయితే, ఇవి ఎంహెచ్ 370కి సంబంధించినవేనా, కావా అనే విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు