ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌కు పార్లమెంటరీ కమిటీ

4 Jun, 2015 00:54 IST|Sakshi
ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌కు పార్లమెంటరీ కమిటీ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ రంగంపై వేసిన అత్యున్నత స్థాయి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (పీఎస్‌సీ) జూన్ 3న హైదరాబాద్‌లోని ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ను సందర్శించనుంది. దేశంలో ఒక ప్రైవేటు కంపెనీని పీఎస్‌సీ సందర్శించడం ఇదే తొలిసారి. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరి నేతృత్వం వహిస్తున్న ఈ కమిటీ... ఇక్కడ ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌తో పాటు ప్రభుత్వ రంగంలో ఉన్న రక్షణ రంగ సంస్థలను కూడా సందర్శించనుంది.
 
 ఆరు దశాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్ రక్షణ, వైమానిక రంగానికి అవసరమైన అత్యంత కీలక పరికరాలను తయారు చేస్తోంది. ఇది కంపెనీ విశిష్ట సేవలకు దక్కిన గుర్తింపు అని ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్ ఎండీ డి.విద్యాసాగర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘కంపెనీ సాధించిన విజయాలను కమిటీకి వివరిస్తాం. ఎదుర్కొన్న కష్టాలనూ తెలియజేస్తాం. మేం లేవనెత్తే అంశాలను కమిటీ అధ్యయనం చేసి తగు పరిష్కారాలు సూచిస్తుందని భావిస్తున్నాం. తద్వారా పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుంది’ అని అన్నారు.
 

మరిన్ని వార్తలు