అమెరికా దెబ్బకు మరో స్విస్ బ్యాంక్ మూసివేత

18 Oct, 2013 20:23 IST|Sakshi

జెనీవా: పన్నుల ఎగవేతలకు ప్రోత్సహిస్తున్న ఆర్ధిక సంస్థలపై ఉక్కుపాదం మోపాలంటూ అమెరికా చేస్తున్న ఒత్తిడితో మరో స్విస్ బ్యాంక్ మూత పడింది. జ్యూరిచ్ కు చెందిన ఫ్రే అండ్ కో అనే స్విస్ బ్యాంక్ తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు వాటాదారులకు వెల్లడించింది. అమెరికాతో పన్న వివాదాల కారణంగా నియంత్రణలు అంతకంతకూ పెరిగిపోతుండటం, చిన్న బ్యాంకుల మనుగడకు వీలుకాని రీతిలో నిబంధనలు, కష్ట తరమైన మార్కెట్ పరిస్థితుల వల్లే ఈ మూసివేత నిర్నయాన్ని తీసుకున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది.దీంతో అమెరికా ఒత్తిడితో మూసేసిన రెండో స్విస్ బ్యాంక్ ఫ్రే అండ్ కో నిలిచింది.

 

దాదాపు 2.2 బిలియన్ల డాలర్ల నిధులు ఈ బ్యాంక్ నిర్వహణలో ఉన్నాయి. అమెరికా పన్ను చెల్లింపుదారులు ఎగవేతలకు చేదోడుగా నిలుస్తాయన్న ఆరోపణలతో అక్కడి న్యాయశాఖ దాదాపు 14 స్విస్ బ్యాంక్ లపై దర్యాప్తు చేపట్టింది.

>
మరిన్ని వార్తలు