వార్రూమ్లో సీమాంధ్ర ప్యాకేజీ

25 Feb, 2014 19:01 IST|Sakshi
వార్రూమ్లో సీమాంధ్ర ప్యాకేజీ

ఢిల్లీ: సీమాంధ్రకు ప్యాకేజీ మరింత పెంచాలని రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ వార్రూమ్లో ఏఐసిసి ప్రతినిధులను కోరారు. వార్రూమ్లో జరిగే కీలక సమావేశానికి కేంద్ర మంత్రి కావూరి సాంబశివరాలు,  పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, డొక్కా మాణిక్యవర ప్రసాద్, బాలరాజు, వట్టి వసంత కుమార్, బాలరాజు, సి. రామచంద్రయ్య, కన్నా లక్ష్మీనారాయణ, అహ్మదుల్లా, కొండ్రు మురళీ హాజరయ్యారు.  ఏఐసిసి ప్రతినిధులు దిగ్విజయ్ సింగ్, జైరామ్ రమేష్, మోతీలాల్ ఓరా, అహ్మద్ పటేల్ హాజరయ్యారు. ఈ సమావేశానికి పిలిచినవారిలో మంత్రులు పార్ధసారధి, శత్రుచర్ల విజయరామరాజు, కాసు కృష్ణా రెడ్డి, తోట నరసింహం, టిజి వెంకటేష్, గంటా శ్రీనివాసరావు డుమ్మాకొట్టారు. ఆరుగురు మంత్రులను కాంగ్రెస్ అధిష్టానం అసలు పిలవనేలేదు.

ఈ సమావేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ముఖ్యమంత్రి ఎంపిక, సీమాంధ్ర ప్యాకేజీ తదితర అంశాలపై చర్చించనున్నారు. రాజకీయ ప్రయోజనాల ప్రాతిపదికన వివిధ అంశాలను చర్చిస్తారు. సీమాంధ్రలో నాయకులను కాపాడుకునే ప్రయత్నంలో అధిష్టానం ఉంది. మంత్రులు మాత్రం  సీమాంధ్రకు ప్యాకేజీ ఇంకాస్త పెంచాలని కోరారు. అలాగే ఎన్నికలను వాయిదా వేయాలని కూడా సీమాంధ్ర మంత్రులు కోరుతున్నారు. అయితే ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని దిగ్విజయ్ సింగ్ వారికి చెప్పారు.

మరిన్ని వార్తలు